మహిళ స్నానం చేస్తుండగా

SMTV Desk 2019-03-30 12:37:22  women, bathing

రంగారెడ్డి: హయతనగర్ మండలం తుర్కయాంజాల్ ప్రాంతం మునగనూర్ గ్రామంలో ఓ మహిళ స్నానం చేస్తుండగా స్మార్ట్ ఫోన్ లో చిత్రీకరించిన యువకుడిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం… ఓ మహిళ తన ఇంట్లో స్నానం చేస్తుండగా మునగనూర్ గ్రామానికి చెందిన ఇంజినీరింగ్‌ విద్యార్థి గంగపురి వెంకటేష్‌ (22) తన ఫోన్ లో ఆ దృశ్యాలను చిత్రీకరించాడు. దీంతో సదరు మహిళ గమనించి గట్టిగా కేకలు వేయడంతో స్థానికులు వచ్చి యువకుడిని చితకబాది పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఫోన్లలో మహిళలు, అమ్మాయిలు ఫోటోలను అనుమతి లేకుంగా తీయరాదని పోలీసులు హెచ్చరించారు. అసభ్యకర ఫోటోలను తీస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు పేర్కొన్నారు.