సాయి పల్లవితో ప్రేమ పెళ్లిపై దర్శకుడి వివరణ

SMTV Desk 2019-03-29 18:50:53  sai pallavi, amala paul,

దక్షిణాది సినీ పరిశ్రమల్లో హీరోయిన్ సాయి పల్లవికి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. గ్లామర్ పాత్రలకు, స్కిన్ షోలకు ఈ అమ్మడు దూరంగా ఉంటుంది. కథా బలం ఉన్న సినిమాలలో మాత్రమే నటించడానికి ఆసక్తి చూపుతుంది. సాయి పల్లవి బొమ్మ పోస్టర్‌పై ఉంటే సినిమా మినిమం గ్యారంటీ అని అభిమానులు నమ్మకంతో సినిమాకు వెళతారు. అలాంటి సాయి పల్లవి ఇప్పుడు దర్శకుడు ఏఎల్ విజయ్‌తో ప్రేమలో ఉందని, త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతుందనే పుకార్లు షికార్లు చేస్తున్నాయి. రూమర్లు ఎక్కువ కావడంతో సదరు దర్శకుడు ఈ రూమర్లపై స్పష్టత ఇచ్చాడు.

గతంలో ఏఎల్ విజయ్‌తో సాయిపల్లవి ‘కణం’ సినిమా చేసింది. ఆ సమయంలోనే వీళ్లిద్దరి మధ్య ప్రేమ మొదలైందనే ప్రచారం జోరుగా జరుగుతోంది. ఈ విషయంపై సాయిపల్లవి మౌనంగానే వుంది. తాజాగా ఏఎల్ విజయ్ స్పందిస్తూ ..”నేను.. సాయిపల్లవి ప్రేమించుకుంటున్నట్టు.. పెళ్లి చేసుకోబోతున్నట్టు వస్తున్న వార్తల్లో ఎంత మాత్రం నిజం లేదు. ఇదంతా పనిలేనివాళ్లు చేస్తున్న ప్రచారం మాత్రమే” అంటూ పుకార్లకు తెరదింపేశాడు. కాగా ఏఎల్ విజయ్ కి 2014 లో హీరోయిన్ అమల పాల్ తో వివాహం జరిగింది. వీరు 2017లో విడాకులు తీసుకున్నారు.