శాంసంగ్‌ ఫోల్డబుల్‌ ఫోన్‌లోని ప్రత్యేకతలు..2 లక్షలసార్లు మడిచినా పాడవదు

SMTV Desk 2019-03-29 17:16:23  samsung foldable,

ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల్లో తనదంటూ ప్రత్యేకతను చాటుకుంది దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తుల సంస్థ శాంసంగ్. ఈ శాంసంగ్ నుంచి ఫోర్టబుల్ ఫోన్(మడతపెట్టే ఫోన్) త్వరలో అందుబాటులోకి వస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ ఫోన్ గురించి శాంసంగ్ వినియోగదారుల్లో అనేక అనుమానాలు వున్నాయి. వాటన్నింటినీ శాంసంగ్ నివృత్తి చేసింది. ఈ ఫోన్‌ను ఎక్కువసార్లు మడతబెడుతూ ఉంటే పాడైపోదా? అసలు ఎన్నిరోజులు ఈ ఫోన్‌ పనిచేస్తుంది? అనే ప్రశ్నలకు సమాధానం ఇచ్చింది. 34 సెకన్ల నిడివి గల వీడియోలో మొత్తం వివరాలు వెల్లడించింది.

ఇందులో ఫోన్‌కు శాంసంగ్‌ ఫోల్డ్‌ టెస్ట్‌ నిర్వహించింది. రోజుకు వందసార్లు చొప్పున మడతపెట్టినా ఎలాంటి ఇబ్బంది వుండదని స్పష్టంచేసింది. అలా ఐదేళ్లలో రెండు లక్షల సార్లు మడతపెట్టినా ఏ సమస్యా లేకుండా ఈ ఫోన్‌ను వాడుకోవచ్చట. దీంతో చాలా మంది ఈ ఫోన్‌ను అడ్వాన్స్ బుకింగ్ చేసుకోవాలని అనుకుంటున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది. ఈ ఫోన్‌ను ఏప్రిల్‌ చివరి నాటికి విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది శాంసంగ్ సంస్థ. ఇది సుమారు 2వేల డాలర్లు (సుమారు రూ.1.38లక్షలు) ఉండవచ్చని చెబుతున్నారు. మరి భారత్‌లో ఇది ఎంత ధరకు విక్రయిస్తారో ప్రస్తుతానికి సస్పెన్సే.


శాంసంగ్‌ ఫోల్డబుల్‌ ఫోన్‌లోని ప్రత్యేకతలు..

–7.3అంగుళాల డైనమిక్‌ ఆమోల్డ్‌ మెయిన్‌ డిస్‌ప్లే

– స్నాప్‌డ్రాగన్‌ 855 ప్రాసెసర్‌(7నానోమీటర్‌ టెక్నాలజీ)
– ఆండ్రాయిడ్‌ పై
– 6 అంగుళాల హెచ్‌డీ+ సూపర్‌ ఆమోల్డ్‌ డిస్‌ప్లే
– 12జీబీ ర్యామ్‌ 512జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌

– 4380 ఎంఏహెచ్‌ బ్యాటరీ

– వెనుక మూడు కెమెరాలు 12‌(టెలిఫోటో)+12+‌(వైడ్‌యాంగిల్‌), 16మెగాపిక్సెల్‌ (అల్ట్రావైడ్‌)
– ఫంట్ర్‌ డ్యుయల్‌ కెమెరా 10+8మెగాపిక్సెల్‌