ఈ ఐదేళ్లలో కేసీఆర్ కుటుంబమే బాగుపడింది

SMTV Desk 2019-03-29 17:03:06  Modi, KCR,

పాలమూరు: మహబూబ్ నగర్ జిల్లా పాలమూరులో ఎన్నికల ప్రచారం నేపథ్యంలో నిర్వహించిన బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగించారు. నేను మీ కాపలాదారుడిని అంటూ ప్రసంగాన్ని మొదలు పెట్టన మోడీ.. నేను సైతం కాపలాదారుడిని అంటూ ప్రతి ఒక్కరూ నినదించాలని పిలుపునిస్తూ ముగించారు.

98 శాతం ఇళ్లకు ఈ కాపలాదారుడు మరుగుదొడ్లు కట్టించాడు. 9 లక్షల ఉచిత గ్యాస్ కనెక్షన్లు తెలంగాణకు ఇచ్చాం. ఎవరి హక్కులను హరించకుండా అగ్రవర్ణాలకు రిజర్వేషన్లు ఇచ్చాం. దేశానికి చౌకీదార్‌గా ఉన్న నేను దేశ రాజకీయాలను మారుస్తున్నానని మోడీ అన్నారు.

కేంద్ర ప్రభుత్వం చేసిన పనుల గురించి వివరించిన మోడీ టీఆర్ఎస్, కాంగ్రెస్‌లపై విమర్శలు చేశారు. ఈ ఐదేళ్లలో కేసీఆర్ కుటుంబమే బాగుపడిందని, తన కుటుంబం కోసం కేసీఆర్ ప్రజలను గాలికొదిలేశారని మండిపడ్డారు. కుటుంబ రాజకీయాలకు ప్రతిరూపం కేసీఆర్. కాంగ్రెస్, టీఆర్ఎస్ ఒక్కటేనని, ఇద్దరివీ వారసత్వ రాజకీయాలేనని మోడీ అన్నారు.

తెలంగాణ ప్రజలు తమను ఆదరించకపోయినా ఎయిమ్స్, సైనిక్ స్కూల్ ఇచ్చాం. జాతీయ రహదారులు, కొత్త రైళ్లు, రైల్వే లైన్లు ఇచ్చాం అని మోడీ చెప్పారు.