వేణు శ్రీరామ్ దర్శకత్వం లో అల్లు అర్జున్

SMTV Desk 2019-03-29 16:41:04  Allu Arjun,

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం త్రివిక్రమ్ డైరెక్షన్ లో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అంతేకాదు ఈ సినిమా తర్వాత సుకుమార్ డైరెక్షన్ లో కూడా ఒక సినిమా చేయనున్నాడు. అయితే ఈ రెండు ప్రాజెక్ట్స్ తో పాటు అల్లు అర్జున్ మరో సినిమాకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట.

‘ఎంసీఏ’ ఫేమ్ వేణు శ్రీరామ్ దర్శకత్వం లో ఈ సినిమా ఉండబోతోందట. తాజాగా వేణు శ్రీరామ్ ఒక ఇంటరెస్టింగ్ సబ్జెక్ట్ ను అల్లు అర్జున్ కు వినిపించాడని సమాచారం. కథ నచ్చడంతో అల్లు అర్జున్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. అయితే ఇంకా దీనిపై అధికారక ప్రకటన రావాల్సి ఉంది. కాగా దిల్ రాజు నిర్మించనున్న ఈ చిత్రం ఈ ఏడాది చివర్లో సెట్స్ మీదకు వెళ్లనుంది.