భద్రతా దళాల అదుపులో ఉగ్రవాది

SMTV Desk 2019-03-29 15:40:34  terrorist,

జమ్మూ కశ్మీర్‌లోని అనంతనాగ్ జిల్లాలో హిజ్బుల్ ముజాహిదీన్‌కి చెందిన ఉగ్రవాదిని భద్రతా దళాలు అదుపులోకి తీసుకున్నాయి. నిఘా వర్గాల నుంచి అందిన సమాచారం మేరకు బిజ్బెహారా ప్రాంతంలో రమీజ్ అహ్మద్ దార్‌ అనే ఉగ్రవాదిని అరెస్ట్ చేశారు.

కుల్గాంకి చెందిన రమీజ్ అహ్మద్.. గత ఏడాదిన్నరగా హిజ్బుల్ ముజాహిదీన్ ద్వారా ఉగ్రవాద కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొంటున్నట్టు స్థానిక పోలీస్ అధికారి వెల్లడించారు. అరెస్ట్ సమయంలో అతడి వద్ద నుంచి ఆయుధాలు, మందుగుండు సామగ్రి స్వాధీనం చేసుకున్నట్టు ఆయన వెల్లడించారు.