ఏపీ ఎన్నికల బరిలోకి బిగ్‌బాస్2 సంజన.

SMTV Desk 2019-03-29 15:37:52  biggboss, sanjana

బిగ్‌బాస్ 2 ఫేమ్ సాయి సంజన తెలుసు కదా. హౌస్‌లో ఒక వారమే వుండి సంచలన వ్యాఖ్యలు చేసి సెన్సేషన్ క్రియేట్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ ఫైర్ బ్రాండ్ రాజకీయాల్లోకి వస్తోంది. నూజివీడు అసెంబ్లీ నియోజక వర్గం నుంచి పోటీ చేస్తోంది. అది కూడా ఇండిపెండెంట్ అభ్యర్థిగా నామినేషన్ వేసింది. కాంగ్రెస్‌ పార్టీ నూజివీడు అభ్యర్థిగా పోటీచేసేందుకు ప్రయత్నించింది. అయితే ఆమెకు కాంగ్రెస్ టికెట్‌ ఇవ్వకపోవడంతో స్వతంత్ర అభ్యర్థిగా నూజివీడు అసెంబ్లీ బరిలో పోటీచేస్తోంది.

సంజన సొంత వూరు నూజివీడు నియోజకవర్గ పరిధిలోని ఆగిరిపల్లి మండలం కృష్ణవరం గ్రామం. ఆమె అసలు పేరు అన్నే వనజ. ఆమె తండ్రి అన్నే ధనకోటేశ్వరరావు ప్రముఖ రైతు. ఆమెకు దివంగత మాజీ ఎమ్మెల్సీ, మంత్రి పాలడుగు వెంకట్రావు సమీప బంధువు అవుతారు. 2016లో మిస్‌ హైదరాబాద్‌గా ఎంపికై టాలీవుడ్‌కు వచ్చింది. ‘నేనే రాజు నేనే మంత్రి’ సినిమాలో నటించింది. జనజాగృతి పార్టీలో రాజకీయాలో కొంతకాలం పనిచేసింది.