తొలివిజయం కోసం

SMTV Desk 2019-03-29 15:34:20  IPL, hyderabad, Rajasthan Royals

ఐపీఎల్ 2019 పాయింట్ల పట్టికలో నిలిచేందుకు సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ శుక్రవారం రాత్రి తలపడనున్నాయి. టోర్నీలో తొలివిజయం కోసం సాధించేందుకు సన్ రైజర్స్ హోమ్ గ్రౌండ్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో, హైదరాబాద్‌లో ఇరు జట్లు బరిలోకి దిగుతున్నాయి. ఇప్పటికే ఇరు జట్లు తమ తొలి మ్యాచ్ లలో బోల్తా కొట్టాయి. ఏడాది నిషేధం అనంతరం ఐపీఎల్‌లో అడుగుపెట్టిన ఆసీస్ ఆటగాళ్లు డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్‌లు ప్రత్యర్థులుగా ఇరు జట్ల తరపునా ఆడనున్నారు. కాగా తొలి మ్యాచ్ లోనే డేవిడ్ వార్నర్ కోల్ కతా నైట్ రైడర్స్ పై 85 పరుగులు సాధించి తన సత్తాచాటాడు.

ఇరు జట్లు ఐపీఎల్ లో ఇప్పటి వరకూ 9 సార్లు తలపడితే అందులో 5సార్లు సన్ రైజర్స్ విజయం సాధించగా, 4 మ్యాచుల్లో రాజస్థాన్ రాయల్స్ విజయం సాధించింది. అయితే సన్ రైజర్స్ తన హోమ్ గ్రౌండ్ లో రాజస్థాన్ రాయల్స్‌తో రెండు సార్లు తలపడితే, రెండింట్లోనూ సన్ రైజర్స్ గెలుపు సాధించడం విశేషం.