విరాట్ కోహ్లీకి కోపం వచ్చింది

SMTV Desk 2019-03-29 13:18:36  virat kohli,

రాయల్ చాలెంజర్స్ కెప్టెన్ విరాట్ కోహ్లీకి కోపం వచ్చింది. మనమంతా ఐపీఎల్ స్థాయి క్రికెట్ ఆడుతున్నాం. క్లబ్ క్రికెట్ స్థాయి కాదు అంటూ.. మండిపడ్డారు. అంపైర్లు కళ్లు తెరిచి అంపైరింగ్ చేయాలి అంటూ చురకలు అంటించారు. గురువారం రాత్రి ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్ లో బౌలర్ మలింగా వేసిన ఆఖరి బంతి నోబాల్ గా తేలినా అంపైర్ గుర్తించకపోవడంతో బెంగుళూరు ఓటమి పాలు కావాల్సివచ్చింది. టెలివిజన్ రీప్లేలో మలింగా నోబాల్ వేసినట్లు స్పష్టంగా కనిపించింది. దీనిపై అంపైర్ ఎస్. రవి నుంచి ఎలాంటి స్పందన రాకపోవడం ముంబై విజయం సాధించింది. ఈ ఘటనతో ఆర్ సీ కెప్టెన్ విరాట్ కోహ్లీ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

అంపైర్లు చాలా జాగ్రత్తగా ఉండి ఇలాంటి సున్నితమైన విషయాలను గమనించాల్సి ఉంటుందని అన్నారు. అలాగే మరింత షార్ప్‌గా అంపైర్లు వ్యవహరించాలని కోహ్లీ సూచించారు