‘సూర్యకాంతం’ మూవీ రివ్యూ..

SMTV Desk 2019-03-29 13:15:52  Suryakantham,

నటీనటులు : నిహారిక, రాహుల్ విజయ్, సుహాసిని,సమీర్,శివాజీ రాజా,

నిర్మాణం : వరుణ్ తేజ్ సమర్పణ

దర్శకత్వం : ప్రణీత్ బ్రహ్మాండపల్లి

‘ఒక మనసు’ సినిమాతో టాలీవుడ్‌లో గ్రాండ్‌గా అడుగుపెట్టింది మెగా డాటర్ నిహారిక. ఇక తర్వాత చేసిన ‘హ్యపీ వెడ్డింగ్’ కూడా ఈ భామకు సక్సెస్ ఇవ్వలేకపోయాయి. తాజాగా ఈ భామ ప్రణీత్ బ్రహ్మాండపల్లి దర్శకత్వంలో ‘సూర్యకాంతం’ సినిమా చేసింది. ఈ మూవీతో నిహారిక హిట్ అందుకుందా లేదా మన మూవీ రివ్యూలో చూద్దాం..

కథ విషయానికొస్తే..

హీరోయిన్ సూర్యకాంతం (నిహారిక) తల్లితండ్రులు చిన్నపుడే విడిపోతారు. దీంతో సూర్యకాంతం తల్లి దగ్గరే పెరుగుతోంది. అంతేకాదు తల్లి పెంపకంలో సూర్యకాంతం చాలా క్రేజీ అమ్మాయిగా మారుతుంది. తనకు ఏది తోస్తే అది చేయడం హాబి. సూర్యకాంతం క్యారెక్టర్ చేసి హీరో (రాహుల్ విజయ్) ఆమె ప్రేమలో పడతాడు. అంతేకాదు సూర్యకాంతంకి తన ప్రేమకు ప్రపోజ్ చేస్తాడు కూడా. ఆ తర్వాత సూర్యకాంతం కనిపించకుండా పోతుంది. దీంతో రాహుల్మ విజయ్ మరో అమ్మాయి ప్రేమలో పడతాడు. ఆమెతో ఎంగేజ్మెంట్ కూడా చేసుకుంటాడు. తీరా పెళ్లి సమయానికి సూర్యకాంతం మళ్లీ హీరో జీవితంలో ప్రవేశిస్తుంది. ఆ తర్వాత రాహుల్ విజయ్ జీవితం ఏమి చేస్తాడు ? అతడు సూర్యకాంతంను పెళ్లి చేసుకున్నాడా లేదా అనేదే ఈ సినిమా స్టోరీ.నటీనటులు విషయానికొస్తే..

నిహారిక సింగిల్ పేరెంట్ ఉన్న తింగరి అమ్మాయి పాత్రలో చక్కగా ఒదిగిపోయింది. ప్రెజెంట్ జనరేషన్‌లో అమ్మాయిలు ఎలా ఉంటారో ఆ క్యారెక్టర్‌లో చక్కగా ఒదిగిపోయింది. మరోవైపు హీరోగా నటించిన రాహుల్ విజయ్ ఉన్నంతలో పర్వాలేదనపించాడు. మిగతా పాత్రల్లో నటించిన నటీనటులు తమ పరిధి మేరకు నటించారు.

టెక్నీషియన్స్ విషయానికొస్తే..

దర్శకుడు ప్రణీత్ బ్రహ్మాండపల్లి..ఒక వెబ్ సిరీస్ చేయాల్సిన కథతో సినిమాను తీసినట్టు కనబడింది. అంతేకాదు దర్శకుడిగా హీరోయిన్ క్యారెక్టర్‌ను క్రేజీగా మలిచిన ఆ పాత్ర చివరికంటూ ఒక లక్ష్యం లేని పాత్రగా మొత్తం కన్ఫ్యూజన్‌గా తీర్చిదిద్దాడు. ముఖ్యంగా కథ మొత్తం ఏదో సీరియల్ తీసినట్టు సాగతీతగా ఉంది. మొత్తంగా సీరియల్ డైరెక్టర్‌‌కు ఎక్కువగా ..సినిమా డైరెక్టర్‌గా తక్కువగా ఉంది ప్రణీత్ బ్రహ్మాండపల్లి డైరెక్షన్.ఫోటోగ్రఫీ కూడా ఏమంత బాగాలేదు. మ్యూజిక్ మాత్రం సోసో గా ఉంది.

ప్లస్

నిహారిక నటన

కొన్ని సన్నివేశాలు

మైనస్

కథ,కథనం

వెబ్ సిరీస్‌ల ఉండటం

సినిమా మొత్తం సాగతీత

ఫోటోగ్రఫీ

డైరెక్షన్ వీక్

రేటింగ్ : 2/5