ఏపీ ఎన్నికల్లో మాజీ అసెంబ్లీ చీఫ్ మార్షల్‌

SMTV Desk 2019-03-29 12:15:39  ycp,

కర్నూలు జిల్లా నందికొట్కూరు నుంచి వైసీపీ తరపు పోటీ చేస్తున్న తోగురు ఆర్థర్ గురించి ఒక ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. గతంలో అసెంబ్లీ చీఫ్ మార్షల్‌గా పనిచేసిన ఆర్థర్‌కు వైసీపీ అనూహ్య రీతిలో టికెట్ ఇచ్చింది. ఏపీ పోలీస్‌ శాఖలో కమాండెంట్ ర్యాంకులో పనిచేసిన ఆయన తర్వాత రోజుల్లో అసెంబ్లీ చీఫ్ మార్షల్‌గా విధులు నిర్వర్తించారు. తర్వాత రాజకీయాల్లోకి అడుగు పెట్టి వైసీపీలో చేరారు. అయితే 2014లోనే వైసీపీ టికెట్ ఆశించినా ఆయనకు దక్కలేదు ఈసారి టికెట్ దక్కించుకున్నఆయన ఎన్నికల్లో గెలిచి ఈసారి అసెంబ్లీలో ఎమ్మెల్యేగా అడుగు పెట్టాలనే ఆశతో ఉన్నారు.

కర్నూలు ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన ఆర్థర్ తర్వాత పోలీసుశాఖలో ఉద్యోగం సంపాదించి అంచేలంచేలుగా ఎదిగి 2009 నుంచి 2011 మధ్య అసెంబ్లీ మార్షల్‌గా పనిచేశారు. తర్వాత డీజీపీ పేషీలో డీఎస్పీగా పనిచేశారు. ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నా ఆయన్ని కాదని ఈయన టికెట్ తెచ్చుకున్నారు. దీంతో కడుపు మండిన ఆయన సైకిల్ ఎక్కారు. ఇక్కడ ప్రస్తుతానికి టీడీపీ తరపున బండి జయరాజు ఎమ్మెల్యే రేసులో ఉన్నారు. మరి ఈ మాజీ మార్షల్ గెలిచి ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగు పెడతారో లేదో చూడాలి మరి !