ఆరెక్స్ 100 రీమేక్ లో స్టార్ కిడ్

SMTV Desk 2019-03-29 10:47:18  rx 100,

అసలు ఏమాత్రం అంచనాలు లేకుండా వచ్చి సూపర్ హిట్ అందుకున్న ఆరెక్స్ 100 రెండు కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించగా 20 కోట్ల దాకా వసూళ్లు రాబట్టింది. ఆ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన పాయల్ రాజ్ పుత్ తెలుగులో మోస్ట్ హ్యపెనింగ్ హీరోయిన్ గా వరుస అవకాశాలను అందుకుంటుంది. ఆరెక్స్ 100 హీరో కార్తికేయ కూడా వరుస సినిమాలు చేస్తున్నాడు.

అజయ్ భూపతి డైరక్షన్ లో వచ్చిన ఆరెక్స్ 100 సినిమా హిందిలో రీమేక్ అవుతుంది. ఈ రీమేక్ లో బాలీవుడ్ స్టార్ సునీల్ శెట్టి తనయుడు ఆహాన్ శెట్టి హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాకు హిందిలో తడప్ అని టైటిల్ ఫిక్స్ చేశారు. మిలాన్ లుత్రియా ఈ సినిమాను డైరెక్ట్ చేస్తుండగా తారా సుతారియా హీరోయిన్ గా నటిస్తుంది. ఇక్కడ తక్కువ బడ్జెట్ తో చేసిన ఈ సినిమా బాలీవుడ్ లో మాత్రం మంచి బడ్జెట్ తోనే తీస్తున్నారట. మరి తెలుగులో సూపర్ సక్సెస్ అయిన ఈ సినిమా హిందిలో ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.