నేను టీడీపీకి సపోర్ట్ చేయాలంటే చెప్పి చేస్తాను

SMTV Desk 2019-03-29 10:45:04  pawan Kalyan,

ఏపీలో ప్రచారం జోరుగా సాగుతోంది, ప్రధాన పోటీ రెండు పార్టీల మధ్యే అయినా పవన్ కూడా తన సర్వ శక్తులూ ఒడ్డుతున్నారు. నిన్న రాత్రి కడపలో నిర్వహించిన జనసేన సభలో పవన్ మాట్లాడారు. రాయలసీమకు, కడపకు రాకుండా చాలా మంది అడ్డుపడ్డారని పవన్ అన్నారు. ప్రచారం కోసం హెలికాప్టర్‌లో రావాలంటే నాకు కేంద్రం నుంచి పర్మిషన్ రద్దు చేశారు ఈ పని చేసింది జగనా? బీజేపీనా? అని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. డొంక తిరుగుడుగా మాట్లాడటం నాకు చేతకాదని ఆయన తెలిపారు. జనసేన అధికారంలోకి వస్తే కడపలో ఉర్దూ యూనివర్సిటీని ప్రారంభిస్తామని జనసేనాని తెలిపారు. తాగు నీటి సమస్యను తీరుస్తామన్నారు. రాయలసీమ నుంచి వచ్చిన ఏ ఒక్క ముఖ్యమంత్రీ చేయని విధంగా ఈ ప్రాంత పురోగతికి కృషి చేస్తానని పవన్ హామీ ఇచ్చారు. జగన్ నన్ను టీడీపీ పార్టనర్ అన్నారు.

నేను టీడీపీకి సపోర్ట్ చేయాలంటే చెప్పి చేస్తాను. అనంతపురం సభకు టీడీపీ అడ్డంకులు కల్పిస్తోంది. వేదికను తొలగించారు. అలాంటి వాళ్లతో కలుస్తానా? ఆ మాత్రం ఇంగితం లేదా మీకు జగన్.. అని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. రాయలసీమ డెవలప్‌మెంట్ కోసం రూ.50 వేల కోట్లతో ప్యాకేజీని అమలుచేస్తానని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలిపారు. సీఎం పదవి కోసం జగన్ రూ.1500 కోట్లు ఆఫర్ చేశారని నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా విమర్శించారనీ ఆయన అల్లా సాక్షిగా ప్రమాణం చేశారని జాతీయ స్థాయి నాయకుడు ఆరోపణలు చేస్తే మీరెందుకు వివరణ ఇవ్వడం లేదు. ఫరూక్ అబ్దుల్లా ఆరోపణలు నిజమేనని ఒప్పుకొంటున్నారా? అని పవన్ ప్రశ్నించారు.