ఫైనల్ ఎగ్జామ్ క్వశ్చన్ ఇది: రైతుల మిత్రులెవరు? A. కుమారస్వామి B. వానపాములు C)యడ్యూర్పప్ప

SMTV Desk 2019-03-28 19:13:27  yeddurappa, kumaraswamy

ఏ పని చేసినా సృజనాత్మకంగా చేయాలంటారు. కానీ అన్ని పనులనూ అలా చేయాలంటే కుదరదు. కొన్ని పనులను పద్ధతి ప్రకారం రొడ్డుకొట్టుడుగా, పాచిపాటలాగా చేయక తప్పదు. ఈ సంగతి పట్టించుకోని ఓ ఉపాధ్యాయుడు చిక్కుల్లో పడి ఉద్యోగం పోగొట్టుకున్నారు.

కర్ణాటకలోని జరిగిందీ తతంగం. బెంగళూరులోని రాజరాజేశ్వరి నగర్‌లోని మౌంట్‌ కార్మెల్‌ ఇంగ్లీష్‌ హైస్కూల్లో పనిచేస్తున్న ఒక ఉపాధ్యాయుడు 8వ తరగతి ప్రశ్నాపత్రం తయారు చేశాడు. ప్రశ్నలు, జవాబులను ఎప్పుడూ రొడ్డకొట్టుడుగా కాకాండా సరికొత్తగా వేయాలనుకున్నారు. అందులో ఒక బహుళైచ్చిక ప్రశ్న కింద..‘ రైతు మిత్రులు ఎవరు?’ అన్నది. దానికి సమాధానం కింద ఎ) కుమారస్వామి బి) వానపాములు సి.)యడ్యూర్పప్ప అని ఆప్షన్లు ఇచ్చారు.

ఇదేదో తేడాగా ఉందని భావించిన విద్యార్థులు ఆ ప్రశ్నను బయటికొచ్చి టాంటాం చేశారు. రైతులకు వానపాములే మిత్రులు అవుతారు తప్పిస్తే సీఎం కుమారస్వామి, విపక్ష నేత యడ్డి కారని, తామంతా వానపాములకే టిక్ పెట్టామని చెప్పారు. అసలే ఎన్నికల సయమం కావడంతో రచ్చ మొదలైంది. ప్రశ్నపత్రం కూడా బయటికి రావడంతో ఆ స్కూల్‌ యాజమాన్యం తలపట్టుకింది. కొశ్చర్ పేపరు తయారు చేసిన ఉపాధ్యాయుడిని ఉద్యోగం నుంచి తొలగించింది. పొరపాటు జరిగిపోయిందని, తాము ఏ పార్టీ తరఫునా వకాల్తా పుటచ్చుకోదని వివరణ ఇచ్చింది.