నీరవ్ మోదీ కోసం లండన్‌కు సీబీఐ, ఈడీ

SMTV Desk 2019-03-28 17:28:23  Nirav modi,

పీఎన్బీ స్కాం కేసులో లండన్‌లో అరెస్టైన ప్రముఖ వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ బెయిల్ కేసు విచారణకు రానుంది. దీంతో భారత ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్(ఈడీ), సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్విస్టిగేషన్(సీబీఐ) బృందం లండన్‌కు బయలుదేరింది. ఈ రెండు సంస్థల నుంచి జాయింట్ డైరక్టర్ స్థాయి అధికారులు అవసరమైన పత్రాలను సిద్ధం చేసుకొని బుధవారం రాత్రి లండన్‌కు బయలుదేరారు.

నీరవ్ మోదీతో పాటు ఆయన భార్య అమీ మోదీపై నమోదైన చార్జిషీట్‌కు సంబంధించిన పత్రాలను కూడా అధికారులు తమ వెంట తీసుకెళ్తున్నారు. ఆ దేశంలోని వివిధ అధికారులను, క్రౌన్ ప్రాసిక్యూషన్ సర్వీస్‌ను కలవనున్న భారత అధికారులు.. నీరవ్ మోదీ, అతని కుటుంబ సభ్యులు, ఇతరులపై భారత్‌లో దాఖలైన కేసులకు సంబంధించిన వివరాలను, సాక్ష్యాలను వివరించనున్నారు. కాగా పంజాబ్ బ్యాంకుకు వేల కోట్లు ఎగనామం పెట్టిన కేసులో లండన్ అధికారులు మార్చి 19న నీరవ్‌ను తమ అదుపులోకి తీసుకున్నారు. అతడికి బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించిన కోర్టు ఈ నెల 29వరకు పోలీస్ కస్టడీని విధించిన విషయం తెలిసిందే.