మాజీ ఎంఎల్‌సి ఇంటిని పేల్చివేసిన మావోయిస్టులు

SMTV Desk 2019-03-28 16:24:14  former mla, moaists killed

బీహార్‌ : మాజీ ఎంఎల్‌సి, బిజెపి అగ్ర నేత అనుజ్ కుమార్ సింగ్ ఇంటిని మావోయిస్టులు పేల్చేశారు. దుమ‌రియా ప్రాంతంలో ఉన్న ఆ ఇంటిని బుధవారం రాత్రి డైన‌మేట్ల‌తో పేల్చేశారు. అయితే ఈ ఘ‌ట‌న‌లో ఎవ‌రూ గాయ‌ప‌డలేదు. వచ్చే లోక్‌స‌భ ఎన్నిక‌ల‌ను బ‌హిష్క‌రించాల‌ని కూడా న‌క్స‌ల్స్ ఆ ఇంటి వ‌ద్ద ఓ పోస్ట‌ర్‌ను వేశారు. ఈ ఘటనతో ఆ ప్రాంత ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. మావోయిస్టుల కదలికలతో ఆ ప్రాంతంలో పోలీసులు భారీ ఎత్తున కూంబింగ్ నిర్వహిస్తున్నారు.