ముగ్గురు ఉగ్రవాదులు హతం..

SMTV Desk 2019-03-28 16:23:03  terrorists, killed

శ్రీనగర్‌: ఉగ్రవాదులు,భద్రతా బలగాలకు మధ్య గురువారం ఉదయం జరిగిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు మృతి చెందిన సంఘటన జమ్ముకశ్మీర్‌లోని షోపియాన్‌ జిల్లా కెల్లర్ ప్రాంతంలో చోటు చేసుకుంది. ఈ ఎదురుకాల్పుల్లో సీఆర్పీఎఫ్‌, ఆర్మీ, జమ్మూకశ్మీర్‌ పోలీసులు సంయుక్తంగా తనిఖీలు చేస్తుండగా ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. దీంతో భద్రతా బలగాలు ఉగ్రవాదులపై ఎదురుకాల్పులు జరిపారు.భద్రతా బలగాల అధికారి ఘటనా స్థలం నుంచి భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఉగ్రవాదుల కోసం భద్రతా బలగాలు గాలింపు చర్యలు చేపట్టాయి.