నీళ్ళలో పడినా పర్వలేదట!!

SMTV Desk 2017-08-12 19:39:13  ulefone, armor2, water resistant phone, damage safe android

ముంబై, ఆగస్ట్ 12: యూల్ ఫోన్ కంపెనీ ఆర్మర్ 2 అనే ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్‌ను విడుదల చేయనుంది. అయితే ఈ ఫోన్ నీటిలో పడినా ఏమీ కాకుండా సురక్షితంగా ఉండే, అంత సులభంగా పగలని వంటి విశేషతలను కలిగి రానుంది. ఈ ఫోన్‌కి సంబంధిచిన వివరాల్లోకి వెళ్తే... 5 అంగుళాల హెచ్ డీ డిస్ ప్లే, గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్, 4700 ఎంఎహెచ్ బ్యాటరీ, 6 జీబీ ర్యామ్, 64 స్టోరేజ్, 256 జీబీ ఎక్స్ పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 7.0 నూగట్ ఓఎస్ తో పనిచేయనున్నట్లు సమాచారం. ఇంకా 16 మెగా పిక్సల్ వెనుక, 8 మెగా పిక్సల్ సెల్ఫీ కెమెరా సౌలభ్యం కలిగి ఉంది. గ్లాస్ ఫైబర్, రీన్ ఫోర్సడ్ పాలీకార్బొనేట్, మెటల్ తో ఈ ఫోన్ ను తయారుచేశారు. రూ.17.300లతో ఈ ఫోన్ మార్కెట్లో లభించనుంది.