“చోటి చోటి బాతే” అంటున్న మహేష్ బాబు

SMTV Desk 2019-03-28 15:11:46  Choti choti batein, pawan kalyan

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో “మహర్షి” సినిమా తెరకెక్కుతున్న సంగతి అందరికి తెలిసినదే..మహేష్ అభిమానులు ఈ సినిమా నుంచి అప్డేట్స్ కావాలని సోషల్ మీడియాలో చేసిన రచ్చ కూడా అందరికి తెలిసినదే.దేనితో చిత్ర యూనిట్ ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగల్ లిరికల్ వీడియో సాంగ్ ను ఈ నెల 29న ఉదయం 9 గంటల 9 నిమిషాలకు విడుదల చేయబోతున్నామని పాట పేరును కూడా రివీల్ చేసేసారు.

ఈ పాటకి “చోటి చోటి బాతే” లైన్ అని క్లారిటీ ఇచ్చేసారు.అయితే ఇది ఖచ్చితంగా హిందీలో ఉండబోతుందని అర్ధమయ్యిపోతుంది.ఇక్కడే మహేష్ పవన్ కళ్యాణ్ ట్రెండ్ ని ఎమన్నా ఫాలో అవుతున్నారా అనిపిస్తుంది.ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఇది వరకే చాలా సినిమాల్లో హిందీ సాంగ్స్ ని పెట్టుకున్నారు.అలాగే మహర్షి సినిమాకి సంగీతం అందిస్తున్న దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన “జల్సా” సినిమాలో కూడా ఒక హిందీ సాంగ్ ఉంది.ఈ “మహర్షి”లో కూడా మన తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా మరో హిందీ సాంగ్ అందిస్తున్నట్టు అనిపిస్తుంది.

అయితే ఇక్కడే మహేష్ పూరి కాంబినేషన్లో వచ్చిన బిజినెస్ మేన్ సినిమాలో “ఆమ్చి ముంబై” అనే పాట కూడా ఉంది కాకపోతే అది పూర్తిగా హిందీలో ఉండదు.మరి ఈ సాంగ్ పవన్ సినిమాల్లోలా పూర్తి స్థాయి హిందీలో ఉంటుందా లేక మళ్ళీ తెలుగు లిరిక్స్ లోకి మారుతుందా అనేది తెలియాలంటే పూర్తి స్థాయి పాట విడుదలయ్యేంత వరకు వేచి చూడాల్సిందే.ఒకవేళ ఉంటే పరోక్షంగా పవర్ స్టార్ ట్రెండ్ ను సూపర్ స్టార్ ఫాలో అయ్యినట్టే అని చెప్పాలి.వంశీ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో మహేష్ సరసన హీరోయిన్ గా పూజా హెగ్డే నటిస్తుంది,అల్లరి నరేష్ ఒక ప్రముఖ పాత్రలో నటిస్తున్నారు.ప్రపంచ వ్యాప్తంగా మే 9న విడుదల కానున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.