నెలకు రూ. 1.20 లక్షల ఆదాయం.. ఎలాగో తెలుసా ?

SMTV Desk 2019-03-28 15:10:00  Bra, Drayer, New York univercity

జిహ్వకో రుచి పుర్రెకోబుద్ధి అంటే ఇదే. వెరైటీలు కోరుకునే జనం బలహీతలను ఓ అమ్మాయి చక్కగా నగదు చేసుకుంటోంది. తను వాడేసిన లోదుస్తులును ఆన్‌లైన్‌లో అమ్మి పారేస్తూ లక్షలు సంపాదిస్తోంది. ఆ దుస్తులను కొనడానికి మగధీరులు క్యూల్లోకి ఎక్కి మరీ వేచిచూస్తున్నారు. నెలకు రూ. 1.20 లక్షల ఆదాయం పంపాదిస్తున్న అమ్మడి కథాకమామిషు ఇదీ..

న్యూయార్క్ యూనివర్సిటీకి చెందిన సదరు 21 ఏళ్ల యువతి తన వ్యాపారం గురించి స్వయంగా వెల్లడించింది. చదువు, ఇతరత్రా ఖర్చుల కోసం ఆన్ లైన్లో వ్యాపారం చేయాలని ఆమె అనుకుంది. కానీ పెట్టుబడి లేకపోవడంతో లోదుస్తులవైపు మళ్లింది. మొదట్లో ఇది అయ్యేపనేనా అని అనుమానం వచ్చింది. అయినా పోయిందేముంది, ప్రయత్నలోపం ఉండకూడదు కదా అని ముందుకు దూకింది. తను వాడిన అండర్‌వేర్స్‌, బ్రాలను అమ్మడం మొదలుపెట్టింది. వాటిని తాను ఎంతకాలం వాడిందీ, వాటి వాసన, వాటితో తన అనుభవం వంటివి కూడా వివరించింది.

అలాంటి వాటికోసమే ఎదురు చూసే పురుషుపుంగవులు పుంజాలు తెంపుకుని ఎగబడ్డారు. ఆ పాతగుడ్డలను హాక్ కేకుల్లా కొనేస్తున్నారు. అమ్మడు ఎక్కువ కాలం వాడిన గుడ్డలకు భారీ ధర పలుకుతోంది. తక్కువ కాలం వాడిన డ్రాయర్‌ను రూ. 9 వేలకు అమ్ముతోంది. దీంతో ఆమె ప్రత్యేక ఆఫర్లు మొదలెట్టింది. ఆ దుస్తులు వేసుకుని తీసుకున్న సెల్ఫీలను కూడా అమ్మేస్తోంది. అంతేకాదు, ఆర్డర్ పెడితే తానే స్వయంగా కస్టమర్ల కొంపలకు వెళ్లి డెలివరీ చేస్తోంది. అంతా బాగానే ఉందిగాని, ఈ డర్టీ ల్యాండ్రీ లో కొన్న పాత లోదుస్తులను కొన్న మగవాళ్లు ఏం చేసుకుంటారని కదా మీ అనుమానం.. చెప్పాంగా పుర్రెకో డర్టీ బుద్ధి అని.