రెడీమి కి పోటీగా శాంసంగ్ గాలక్సీ ఏ2 కోర్

SMTV Desk 2019-03-28 12:40:09  redmi, samsung galaxy a2 core

దక్షిణ కొరియాకు చెందిన దిగ్గజ ఎల‌క్ట్రానిక్స్ త‌యారీదారు శాంసంగ్ త‌న నూత‌న స్మార్ట్‌ఫోన్ గెలాక్సీ ఎ2 కోర్‌ను విడుదలకు సిద్ధం చేసింది. దీని ధ‌ర వివ‌రాల‌ను ఇంకా వెల్ల‌డించ‌కపోయినా.. ఇందులో ప‌లు ఆక‌ట్టుకునే ఫీచ‌ర్ల‌ను రంగరించింది. ఈ ఫోన్ ఫీచర్లను గమనిస్తే దీని ధర పది వేల కంటే తక్కువగా ఉండబోతుందని సాంకేతిక విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. ఈ శాంసంగ్ ఫొన్ ఇటీవలే విడుదలైన ‘రెడీమి గో’ ఫోన్‌కు పోటీ ఇవ్వబోతుందని తెలుస్తోంది.

శాంసంగ్ గెలాక్సీ ఎ2 కోర్ ఫీచ‌ర్లు…

5 ఇంచ్ డిస్‌ప్లే,

540 x 960 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌,

1.6 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ ఎగ్జినోస్ 7870 ప్రాసెస‌ర్‌,

1 జీబీ ర్యామ్‌, 8 జీబీ స్టోరేజ్‌,

256 జీబీ ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్‌,

ఆండ్రాయిడ్ 8.1 ఓరియో గో ఎడిష‌న్‌,

డ్యుయ‌ల్ సిమ్‌,

5 మెగాపిక్స‌ల్ బ్యాక్ కెమెరా,

సెల్ఫీ కెమెరా,

4జీ వీవోఎల్‌టీఈ,

బ్లూటూత్ 4.2 ఎల్ఈ,

2600 ఎంఏహెచ్ బ్యాట‌రీ.