‘రాస్కెల్‌.. మా బతుకు మీ చేతుల్లో ఉన్నాయిరా'.. నరికి పోగుపెడతాను

SMTV Desk 2019-03-28 12:39:17  balakrishna, mojo

నటుడు, టీడీపీ ఎమ్మెల్యే బాలయ్య ఈ సారి చేయితోపాటు నోరు కూడా చేసుకున్నారు. విలేకర్లను బండబూతులు తిట్టారు. దీనిపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఆయన అనంతపురం జిల్లా హిందూపురంలో ఎన్నికల ప్రచారంలో చెలరేగారు. మోజో టీవీ ప్రతినిధులపై విచురుకుపడ్డారు. ఆ టీవీ విలేకరి తీసిన వీడియో క్లిప్పును డిలీట్ చేయాలని బాలయ్య కేకలు వేశారు. విలేకర్లను చేత్తో విసిరికొట్టారు.

‘రాస్కెల్‌.. మా బతుకు మీ చేతుల్లో ఉన్నాయిరా. నరికి పోగుపెడతాను, ప్రాణాలు తీస్తాను… (బూతులు బూతులు).. బాంబులు వేయడం కూడా తెల్సు నాకు… కత్తి తిప్పడం కూడా తెల్సు’ అని బెదిరించారు. దీనికంతా కారణం మోజో తీసిన వీడియో బాలయ్యను ఇబ్బంది పెట్టేలా ఉండడమే. బాలయ్యను చూడ్డానికి వచ్చిన చిన్నపిల్లలను ఆయన వ్యక్తిగత భద్రతా సిబ్బంది ఈడ్చేశారు. దీన్ని మోజూ టీవీ కెమెరామన్ రికార్డు చేశారు.