మీడియాకు క్షమాపణలు చెప్పిన బాలకృష్ణ

SMTV Desk 2019-03-28 12:37:19  balakrishna,

హిందూపురం నియోజకవర్గం ఎన్నికల ప్రచారం సందర్బంగా జర్నలిస్ట్ పై బాలకృష్ణ చెయ్యి చేసుకున్న సంగతి తెలిసిందే, ఈ ఘటనపై బాలకృష్ణ స్పందించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా అక్కడ ఉన్న చిన్నపిల్ల మీద పడి వీడియో తీస్తున్నవారు అల్లరి మూకల పని అని భావించి వారిని వారించడం జరిగిందని స్పష్టం చేశారు. అక్కడ ఉన్నది మీడియా వారని ఆ తర్వాతే తెలిసిందన్నారు.అంతేకానీ ఉద్దేశపూర్వకంగా చేసింది కాదని స్పష్టం చేశారు. ఈ విషయంలో మీడియా మిత్రులకి బాధకలిగించి ఉంటే క్షమాపణలు కోరుతున్నట్లు బాలకృష్ణ సోషల్ మీడియా ద్వారా క్షమాపణలు చెప్పారు బాలయ్య.

వివరాల్లోకి వెళ్తే హిందూపురం నియోజకవర్గంలో బాలకృష్ణ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. అయితే బాలకృష్ణకు ఎదురుగా చిన్నపిల్లలు వస్తుండటంతో ఆయన వ్యక్తిగత సిబ్బంది వారిని పక్కకు లాగిపడేశారు. ఆ దృశ్యాలను మీడియా ప్రతినిధి షూట్ చేశారు. ఆ విషయాన్ని గమనించిన బాలకృష్ణ ఆ ప్రతినిధిపై విరుచుకుపడ్డారు. కెమెరాలో చిత్రీకరించిన దృశ్యాలను డిలీట్ చెయ్యాలని తిట్టిపోశారు. ఆగ్రహంతో చెయ్యి కూడా చేసుకున్నారు. రాస్కెల్‌ మా బతుకు మీ చేతుల్లో ఉన్నాయారా అంటూ విలేకరిపై నిప్పులు చెరిగారు, జనం పెద్ద ఎత్తున తరలివస్తుండటంతో బాలయ్య అక్కడి నుండి వెళ్లిపోయారు.