షూటింగ్‌లో తీవ్రంగా గాయపడ్డ విశాల్

SMTV Desk 2019-03-28 11:27:26  vishal, vishal injured

కోలీవుడ్ నటుడు విశాల్ షూటింగ్‌లో తీవ్రంగా గాయపడ్డాడు. ఆయన ఎడమ చేయి, కాలికి తీవ్రంగా గాయాలయ్యాయి. దీంతో షూటింగ్‌కు బ్రేక్ ఇచ్చాడు దర్శకుడు.

కాగా ఇటీవల ‘అయోగ్య’ మూవీ షూటింగ్‌లో గాయాలపాలైన పాలైన విశాల్.. ఆ గాయాలు మానకముందే సుందర్ సి సినిమాలో పాల్గొన్నాడు. ఈ మూవీ షూటింగ్ ప్రసుత్తం టర్కీలో జరుగుతుండగా.. అక్కడ విశాల్‌పై యాక్షన్ సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. ఈ క్రమంలో ఏటీవీ బైక్‌ను నడుపుతున్న విశాల్, కంట్రోల్ కోల్పోవడంతో కిందపడ్డాడు. దీంతో ఆయనకు తీవ్ర గాయాలు కాగా.. వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు. అక్కడ విశాల్‌కు ప్రాథమిక చికిత్స చేసిన వైద్యులు, ఆయనకు విశ్రాంతి ఇవ్వాలని సూచించారు. దీంతో సుందర్. సి షూటింగ్‌కు బ్రేక్ ఇచ్చాడు. కాగా ఈ చిత్రంలో తమన్నా హీరోయిన్‌గా నటిస్తోన్న విషయం తెలిసిందే.