కీలక ప్రకటన చేసిన మోడీ...మిషన్ శక్తి !

SMTV Desk 2019-03-27 15:01:01  modi , pm modi, mission shakthi

దేశవాసులకు గర్వ కారణమైన వార్త ఇది. భారత్ అంతరిక్ష శక్తిగా అవతరించింది. మన శాస్త్రవేత్తలు అంతరిక్షంలో లైవ్ శాటిలైట్‌ను పడగొట్టారు. కేవలం మూడే 3 నిమిషాల్లో ఈ ఆపరేషన్ నిర్వహించారు. దేశవాసులకు అత్యంత గర్వకారణమైన ఈ వార్తను ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా వెల్లడించారు. ఇప్పటివరకు అమెరికా, రష్యా, చైనా మాత్రమే ఈ ఘనత సాధించాయని తెలిపారు. భారత్ నాలుగో రాజ్యంగా అవతరించిందని సగర్వంగా వెల్లడించారు. భారత రక్షణ రంగానికి సంబంధించిన అత్యంత కీలకమైన ఈ ఆపరేషన్ పేరును ‘మిషన్ శక్తి’గా ప్రధాని మోదీ వెల్లడించారు. భారత్ ను ఈ స్థాయికి తీసుకొచ్చిన శాస్త్రవేత్తలందరికీ ఆయన ధన్యవాదాలు , శుభాకాంక్షలు తెలిపారు.

భారతదేశంలో అనేక వ్యవస్థలున్నాయి. అనేక రంగాలకు చెందిన ప్రజలు నివసిస్తున్నారు. అయితే అన్నిచోట్ల కూడా సాటిలైట్ సేవలు అందుతున్నాయని ప్రతీ ఒకరు వీటిని ఉపయోగించుకుంటున్నారు. రానున్న రోజుల్లో సాటిలైట్ సేవలు లేకుండా మనం బతకలేకపోవచ్చన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మనం శాటిలైట్ సేవల్ని రక్షించుకోవాలనుకున్నారు ప్రధాని మోదీ. యాంటీ శాటిలైట్ వెపన్ A-SAT ద్వారా లో ఎర్త్ ఆర్బిట్లో లైవ్ శాటిలైట్‌ను కూల్చేశామన్నారు మోదీ. మిషన్ శక్తి ఆపరేషన్‌ను మూడు నిమిషాల్లో విజయవంతంగా పూర్తి చేశామన్నారు. డీఆర్డీఓ శాస్త్రవేత్తలు, పరిశోధకులకు ధన్యావాదాలు తెలిపారు. అమెరికా, రష్యా , చైనా తర్వాత భారత్ స్పేస్ సెంటర్‌ గా ఎదిగింది అన్నారు ప్రధాని. అయితే దేశాల మధ్య యుద్ధ వాతావరణం కల్పంచడం మన ఉద్దేశం కాదన్నారు.