ఉద్యోగం ఇచ్చి.. కామ కోర్కెలు తీర్చాలని డిమాండ్ ....

SMTV Desk 2019-03-27 14:01:28  Employee, bhimavaram, sexual harrasment

తనకు ఏదైనా ఉద్యోగం ఇప్పించాలని బతిమాలిన క్లాస్ మేట్ కు, తన భర్త వద్దే ఉద్యోగం ఇప్పించిన ఓ యువతిని వేధింపులకు గురిచేసిన దుర్మార్గుడి ఉదంతం ఇది. బాధితురాలు, భీమవరం పోలీసులు వెల్లడించిన కథనం ప్రకారం, పట్టణ పరిధిలోని మెంటేవారితోటకు చెందిన యువతికి ఐదు సంవత్సరాల క్రితం తమిళనాడుకు చెందిన యువకుడితో వివాహం కాగా, వారు సేలంలో కాపురం ఉంటున్నారు. గతంలో యువతితో చదువుకున్న సుధాకర్ అనే వ్యక్తి, ఉద్యోగం ఏదైనా చూడాలని బతిమాలడంతో, భర్త వద్ద పనిలో పెట్టించిందామె. ఒకరోజు తన ల్యాప్ టాప్ పాడైపోయిందని భాధితురాలి వద్దకు వచ్చిన సుధాకర్, ఆమె ల్యాప్ టాప్ తీసుకుని, అందులోని ఆమె చిత్రాలను దొంగిలించాడు. ఆపై వాటిని మార్ఫింగ్ చేసి, తన కోరిక తీర్చాలని వేధింపులు ప్రారంభించాడు. తనకు రూ. 25 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. లేకుంటే ఈ ఫోటోలను ఇంటర్నెట్ లో పెడతానని బెదిరింపులకు దిగాడు. సుధాకర్ వేధింపులు పెరిగిపోవడంతో ఆ యువతి పోలీసులను ఆశ్రయించింది. దీనిపై కేసు నమోదు చేశామని, విచారణ ప్రారంభించామని పోలీసులు తెలిపారు.