పోలవరం ప్రాజెక్టును ఆపండి

SMTV Desk 2019-03-27 11:06:58  Polawaram project,

పర్యావరణ అనుమతులపై పున:సమీక్షించాలని, అప్పటి వరకూ పోలవరాన్ని ఆపాలని తెలంగాణ ప్రభుత్వం కొత్త అభ్యంతరం వ్యక్తం చేసింది. దీనిపై తెలంగాణ ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. 2005లో పోలవరానికి కేంద్రం పర్యావరణ అనుమతుల ప్రకారం 36 లక్షల క్యూసెక్కుల గరిష్ట వరద ముంపు అంచనా వుంది. అయితే ప్రస్తుతం డిజైన్‌ మార్పుతో ఆ ముంపు ప్రభావం 50 లక్షల క్యూసెక్కులకు చేరిందని అఫిడవిట్‌లో పేర్కొంది. ఈ క్రమంలో మరోసారి పర్యావరణ ప్రభావాన్ని అంచనా వేయాలని, ఆ తర్వాతే పోలవరానికి కేంద్రం అనుమతులు ఇవ్వాలని పొంగులేటి సుధాకర్ రెడ్డి వేసిన కేసులో సుప్రీంలో తెలంగాణ ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసింది.

పర్యావరణ అనుమతులు ఇచ్చే ముందు వరద ముంపు ప్రభావాన్ని అంచనా వేయాలని కోరింది. తెలంగాణ వాటాగా 45 టీఎంసీల నీటిని అదనంగా వాడుకునేందుకు అనుమతివ్వాలని పేర్కొంది. అదేవిధంగా పట్టిసీమ ప్రాజెక్టు నుంచి ఏపీ గోదావరి నీటిని వినియోగించుకుంటోందని తెలిపింది. ఏ రాష్ట్రంలోని ఆస్తులు ఆ రాష్ట్రానికే చెందేలా 9,10 షెడ్యూల్‌ల్లోని ఆస్తుల విభజన చేయడానికి వీల్లేదని సుప్రీం కోర్టుకు సమర్పించిన అఫిడవిట్లో తెలంగాణ ప్రభుత్వం పేర్కొంది.