రవిచంద్రన్ అశ్విన్ పై విమర్శలు

SMTV Desk 2019-03-27 10:59:56  Ravi ashwin, punjab

కింగ్స్ XI పంజాబ్ కెప్టెన్ రవిచంద్రన్ అశ్విన్ పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిన్న రాజస్థాన్ రాయల్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ మధ్య జరిగిన మ్యాచ్‌లో అశ్విన్ రాజస్థాన్ బ్యాట్స్ మెన్ జోస్ బట్లర్ ను మన్కడింగ్ ద్వారా ఔట్ చేశాడు. దీంతో మ్యాచ్ చూస్తున్న అభిమానులంతా ఆశ్చర్యానికి గురయ్యారు. దీనిపై సర్వాత్రా తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఈ వివాదంపై ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) చైర్మన్ రాజీవ్ శుక్లా మండిపడ్డారు.

టోర్నీకి ముందు విరాట్ కోహ్లీ, ఎంఎస్ ధోనీ, ఇతర ఫ్రాంచైజీ కెప్టెన్లతో సమావేశం నిర్వహించారు. ఇందులో నాన్ స్ట్రైకర్ ఎండ్‌ లో క్రీజు బయటికి వెళ్లిన బ్యాట్స్ మెన్లను క్రీడాస్ఫూర్తి పాటిస్తూ మన్కడింగ్ ద్వారా రనౌట్ చేయొద్దని నిర్ణయించినట్లు శుక్ల ట్వీట్‌లో పేర్కొన్నారు. ‘కెప్లెన్లు మ్యాచ్ రిఫరీల సమావేశంలో ఎవరైనా బ్యాట్స్ మెన్ నాన్ స్ట్రైకర్ ఎండ్ వైపు క్రీజ్ నుంచి బయటకి వెళ్తే క్రీడా స్ఫూర్తితో ఔట్ చేయొద్దని నిర్ణయించాం’ అని తెలిపారు.

కానీ అశ్విన్ నాన్ స్ట్రైకర్ ఎండ్ లో జోస్ బట్లర్ క్రీజ్ నుంచి బయటకి వెళ్లడంతో మన్కడింగ్ ద్వారా రనౌట్ చేశాడు. దీనిపై అంపైర్ వెంటనే థర్డ్ అంపైర్ సలహా కోరాడు. దీంతో క్రీడా నియమాల ప్రకారం.. థర్డ్ అంపైర్ క్రీడా నియమాల ప్రకారం ఔట్‌గా ప్రకటించాడు. దీంతో అప్పటిదాకా ఓ లాగా ఉన్న ఆట.. బట్లర్ ఔట్‌తో మలుపు తిరిగి, 14 పరుగుల తేడాతో పంజాబ్ విజయం సాధించింది. ఇలాంటిది ఐపీఎల్‌లో చరిత్రలో మొట్టమొదటిసారి జరిగింది. అశ్విన్ తీరుపై రాజస్థాన్ కోచ్ ప్యాడీ యాప్టన్ మండిపడ్డారు. మ్యాచ్ అనంతరం షేక్ హ్యాండ్ ఇస్తూ అశ్విన్ ను ఏదో అన్నాడు. దాన్ని అశ్విన్ మాత్రం పట్టించుకోలేదు. అలాగే బట్లర్ కూడా అశ్విన్ కు షేక్ హ్యాండ్ ఇచ్చాడు. కానీ అశ్విన్ అతని ముఖం కూడా చూడలేదు.