ఎన్నికల వేళ ఒడిశాలో దారుణం

SMTV Desk 2019-03-27 10:51:43  murder, odisha, former mla

ఎన్నికల వేళ ఒడిశాలో దారుణం జరిగింది. 2014లో కేంఝర్ జిల్లా ఘషిపుర శాసనసభ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన రామచంద్ర బెహరా అనే వ్యక్తిని గుర్తు తెలియని దుండగులు దారుణంగా హత్య చేశారు. సోమవారం రాత్రి రామచంద్ర ఇంటికి వెళ్లిన దుండగులు.. మాట్లాడాలంటూ అతడిని గ్రామ శివారుకు తీసుకెళ్లారు. ఆ తరువాత ఆయనపై కత్తులతో దాడి చేసి కాళ్లు, చేతులు నరికి అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఆ తరువాత అపస్మారక స్థితిలో ఉన్న రామచంద్రను గుర్తించిన స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో వైద్యుల సూచనలతో కటక్ పెద్దాసుపత్రికి తరలిస్తుండగా రామచంద్ర మధ్యలోనే మృతి చెందారు. దీనిపై కేసును నమోదు చేసుకున్న పోలీసులు నలుగురికి అరెస్ట్ చేసి విచారిస్తున్నారు.