విశాఖపట్నంలో ఘోర అగ్ని ప్రమాదం

SMTV Desk 2019-03-27 10:40:49  vishakapatnam, subbavaram district gollapally mandal fire accident

విశాఖపట్నం, మార్చ్ 26: విశాఖపట్నం జిల్లాలో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. కాగా ఈ సంఘటనలో ఏడుగురికి తీవ్రగాయాలయ్యాయి. పూర్తి వివరాల ప్రకారం విశాఖపట్నం జిల్లా సబ్బవరం మండలం గొల్లపల్లిలోని భూ లోకమాంబ ఫైర్ వర్క్స్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో.. అందులో పని చేస్తున్న ఏడుగురికి తీవ్రగాయాలయ్యాయి. సమాచారంమందుకున్న ఫైర్ సిబ్బంది వెంటనే మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. గాయపడిన వారిని కేజీహెచ్‌కు తరలించారు. బాణాసంచా తయారీలో భాగంగా ప్రమాదం జరిగినట్లు పోలీసులు చెప్పారు. దాసరి సత్యం, గంగమ్మ, రాములమ్మ, కోటమ్మ చిన్న, కనకరాజు, సింగంపల్లి దుర్గారావు ప్రమాదంలో గాయపడ్డవారిలో ఉన్నారు. గాయపడ్డవారంతా దాదాపు ఒకే కుటుంబానికి చెందినవారు.