ఎండాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు

SMTV Desk 2019-03-27 10:35:49  Endakalam , hot summer

వచ్చే జూన్ వరకు ఎండల తీవ్రత అధికంగా ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఈ క్రమంలో ఎండల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రాణానికి హాని కల్గి ప్రమాదం ఉందని వైద్యులు చెబుతున్నారు. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధుల భద్రతకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. ఉష్ణోగ్రత్తలు 40డిగ్రీలు తాటిన నేపథ్యంలో పనులకు వెళ్లే వారు ఉదయం 10లోపు మళ్లీ సాయంత్రం తర్వాత పనులు చేసుకోవడం మంచింది. వడ గాడ్పుపుల నుంచి రక్షణ పొందేందుకు తగిన చర్యలు తీసుకోవాలి.

* వేడిగా ఉన్న రోజుల్లో తప్పనిసరిగా గొడుగు వాడాలి.
* తెలుగు రంగులో ఉండే పలుచని కాటన్ వస్త్రాలు ధరించాలి.
* నెత్తికి టోపీ, రుమాలు పెట్టుకోవాలి.
* ఉప్పు కలిపిన మజ్జిగ లేదా గ్లూకోజు కలిపిన నీరు తాగవచ్చు, లేదా ఓరల్ డి హైడ్రేషన్ ద్రావణాన్ని తాగాలి.
* వడదెబ్బకు గురైన వారిని శీతల ప్రాంతానికి వెంటనే చేర్చాలి.
* వడదెబ్బకు గురైన వారిని తడిగుడతో శరీరం అంతా రుద్దుతూ ఉండాలి.
* వడదెబ్బకు గురైన వారిలో సాధారణ మార్పులు లేకుంటే దగ్గర్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించాలి.
* మంచినీరు ఎక్కువ సార్లు తాగాలి.
* ఇంటి నుంచి బయటకు వెళ్లే ముందు ఒక గ్లాసునీరు తాగాలి.
* ఎండలో బయట నుంచి వచ్చిన వెంటనే నిమ్మరం, కొబ్బరి నీళ్లు, చల్లని నీరు ఏదైనా ఒకటి తీసుకోవాలి.
* తీవ్రమైన ఎండలో బయటికి వెళ్లినప్పుడు తలతిరుగుట తదితర ఆరోగ్య సమస్య ఏర్పడితే దగ్గరలో ఉన్న వైద్యుడిని సంప్రదించి ప్రాథమిక చికిత్స చేయించుకోవాలి.
* ఎండలో గొడుగు లేకుండా తిరగరాదు.
* వేసవికాలంలో నలుపురంగు దుస్తులు, మందంగాఉండే దుస్తులు ధరించరాదు.
* నెత్తికి టోపీ లేకుండా బయట తిరుగరాదు.
* వడదెబ్బకు గురైన వారిని వేడినీటిలో ముంచిన బట్టతో తుడవరాదు.
* మధ్యాహ్నం 1గంటల తర్వాత ఆరు బయట ఎక్కువ శారీరక శ్రమతో కూడిన పని చేయరాదు.
* ఎండలో బయట నుంచి వచ్చిన వెంటనే తీపి పదార్థాలు, తేనే తీసుకోకూడదు.