తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు హైకోర్ట్ నోటీసులు

SMTV Desk 2019-03-27 10:33:48  Telangana, KCR,

తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుకు హైకోర్టు నోటీసులు ఇచ్చింది. 2018లో నిర్వహించిన తెలంగాణ అసెంబ్లీ ముందస్తు ఎన్నికల్లో నిబంధనలు ఉల్లంఘించారంటూ కేసీఆర్ పై పిటిషన్ దాఖలైంది. అయితే గజ్వేల్ నియోజకవర్గం నుంచి గెలిచిన కేసీఆర్ ఎన్నికల అఫిడవిట్‌లో తప్పుడు సమాచారం ఇచ్చారని పిటిషన్ వేయడం జరిగింది.

కాగా ఆయనపై 64 క్రిమినల్ కేసులు ఉంటే మొదటి అఫిడవిట్‌లో కేవలం 4 కేసులు మాత్రమే చూపారని పిటిషనర్‌ పేర్కొన్నారు. ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన హైకోర్టు... సీఎం కేసీఆర్ కు ఎన్నికల కమిషన్ తో సహా 14 మందికి హైకోర్ట్ నోటీసులు జారీ చేసింది. కాగా విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.