కేఏ పాల్ నామినేషన్స్ కు ఆమోదం?

SMTV Desk 2019-03-27 10:24:59  ka paul nomination

ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌ నరసాపురం పార్లమెంట్‌, అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థిగా దాఖలు చేసిన నామినేషన్లను ఎన్నికల అధికారులు ఆమోదించారు. భీమవరం అసెంబ్లీ స్థానానికి నామినేషన్‌ వేసేందుకు నిన్న ఆయన ఆలస్యంగా వెళ్లడంతో రిటర్నింగ్‌ అధికారి నిరాకరించిన విషయం తెలిసిందే.

అయితే ఈరోజు సబ్‌ కలెక్టర్‌ కార్యాలయంలో అధికారులు నామినేషన్ల పరిశీలన (స్క్రూట్నీ) చేపట్టారు. పత్రాలు అన్నీ సరిగా ఉన్నందున నర్సాపురం లోక్‌సభతో పాటు అసెంబ్లీ స్థానానికి పాల్‌ వేసిన నామినేషన్‌కు అధికారులు ఆమోదం తెలిపారు. కాగా దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.