ఫ్యాన్‌కు రెక్కలు విరగలేదు కానీ పవర్ లేదు .. పవన్ కళ్యాణ్ మార్క్ పంచ్

SMTV Desk 2019-03-27 10:23:15  Pawan Kalyan, Janasena, Jagan,

అమరావతి: పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా నెల్లూరులో ప్రచారం చేస్తున్న జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ టిడిపి, వైసిపిపై విమర్శలు గుప్పించారు. అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేస్తున్న వైసిపి అభ్యర్థులపై విరుచుకపడ్డారు. వైసిపి అభ్యర్థులు బెట్టింగ్ రాయుళ్లా మారారని, చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకునేవారికి ఎంఎల్‌ఎ టికెట్టు ఎలా ఇస్తారని జగన్‌ను ప్రశ్నించారు. ఫ్యాన్‌కు రెక్కలు విరగలేదని, కానీ ఫ్యాన్‌కు పవర్ లేదని ఎద్దేవా చేశారు. ఒకప్పుడు ఎపి సిఎం చంద్రబాబు నాయులు సైకిల్ మీద తిరిగేవారని, ఇప్పుడు సైకిల్ తను భుజాల మీద వేసుకుని బాబు తిరుగుతున్నాడని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. సైకిల్ చైన్‌ను కెసిఆర్ ఎప్పుడో తెంచేశారని, అందుకే సైకిల్ తొక్కలేక బాబు మోసుకొస్తున్నారని పవన్ ఎద్దేవా చేశారు.