మరింత ప్రియం కానున్న రెనో కార్లు

SMTV Desk 2019-03-26 18:41:17  Renault Kwid

మార్చ్ 26: ఫ్రాన్స్‌కు చెందిన దిగ్గజ ఆటోమొబైల్ కంపెనీ రెనో తన ‘క్విడ్‌’ మోడల్‌ కార్ల ధరలను ఏప్రిల్‌ 1 నుంచి పెంచనున్నట్లు ప్రకటించింది. ఈ నేపథ్యంలో కార్ల ధరలు 3 శాతం పెరుగుతాయని వెల్లడించింది. ఉత్పత్తి వ్యయాల పెరుగుదల కారణంగా ధరలు పెంచాల్సి వచ్చిందని తెలిపింది. రెనో క్విడ్ కార్లు 0.8 లీటర్ నుంచి 1.0 లీటర్ ఇంజిన్ సామర్థ్యంతో అందుబాటులో ఉన్నాయి. మ్యానువల్, ఆటోమేటెడ్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్లలో ఇవి లభ్యమౌతున్నాయి. రెనో కారును మార్కెట్‌లోకి తీసుకువచ్చిన దగ్గరి నుంచి కంపెనీ 2,75,000 యూనిట్లను విక్రయించింది. అయితే గత కొన్ని నెలలుగా క్విడ్ కార్ల అమ్మకాలు తగ్గుతూ వస్తున్నాయి. ఈ సమస్యను అధిగమించేందుకు కంపెనీ ఇటీవలే పలు భద్రతా ఫీచర్లతో సరికొత్త రెనో కారును మార్కెట్‌లో లాంచ్ చేసింది. రెనో క్విడ్ కార్ల ధర ప్రస్తుతం రూ.2.66 లక్షల నుంచి రూ.4.63 లక్షల మధ్య ఉంది.