30 వేల మ్యాప్‌లను ధ్వంసం చేసిన చైనా

SMTV Desk 2019-03-26 17:12:07  china, geographical maps, china government, china destroys thousands of geographical maps

బీజింగ్‌, మార్చ్ 26: చైనా సర్కార్ అధికారులు ఇప్పటివరకు తమా దేశానికి సంభందించి కొన్ని వేల మ్యాపులను ధ్వంసం చేసింది. అయితే తాజాగా ఒక సంస్థపై దాడి చేసి దాదాపు 30 వేల మ్యాప్‌లను ధ్వంసం చేశారు. ఎందుకంటే చైనా తన భూభాగంగా చెప్పుకునే ప్రాంతాలు ఆ మ్యాప్‌లో లేకపోవడమే. అరుణాచల్‌ ప్రదేశ్‌, టిబెట్‌, తైవాన్‌లను వేరే దేశాల్లో భూభాగంగారు, స్వతంత్య్ర దేశాలుగా చూపడమే ఆ కంపెనీలు చేసిన నేరం. చైనా భౌగోళిక సార్వభౌమాధికారిన్ని భంగపరిచేలా ఈ మ్యాప్‌లు ఉన్నాయని అధికారులు పేర్కొన్నారు. ఈ ఘటన చైనాలోని అన్హూయి ప్రావిన్స్‌లో క్వింగ్డో పట్టణంలో చోటు చేసుకుంది. అక్కడ ఓ ఆఫీస్‌పై దాడి చేసిన అధికారులు దాదాపు 800 బాక్సుల్లో ఉన్న 28,908 మ్యాప్‌లను ధ్వంసం చేశారు.