ఇది ఫారెన్ బైక్ కాదు...మన హీరో స్ల్పెండరే

SMTV Desk 2019-03-26 17:11:14  hero, hero motors, hero bikes, hero splendor, hero splendor modified bike

మార్చ్ 26: ఇండియాలో తక్కువ ధరలో అందుబాటులో ఉంది ఎక్కువ మైలేజి ఇచ్చే బైక్ అంటే మొదట గుర్తొచ్చేది హీరో స్ల్పెండర్. ఈ బైక్ కు ఫ్యామిలీ ఆడియన్స్ విపరీతంగా ఉంటారు. అయితే ఇందులో మోడిఫైడ్ బైక్ ఒకటి బైక్ ప్రియులకు తెగ ఆకర్షిస్తోంది. ఇంజిన్, అలాయ్ వీల్స్, సస్పెన్షన్ మినహా మిగతా విడిభాగాలన్నీ కొత్తవే. పెట్రోల్ ట్యాంక్‌ను కొత్త దానితో రీప్లేస్ చేశారు. సీట్ కూడా భిన్నమైన డిజైన్‌తో ఉంది. హ్యాండిల్‌బార్, ఫ్యూయెల్ ట్యాంక్, సీట్ కవర్ అన్ని కూడా ఒకే రంగులో ఉంటాయి. ఎక్స్‌ఫోజ్‌డ్ ఫ్రేమ్‌ను లెదర్ బ్యాగ్‌తో కవర్ చేశారు. సైడ్ ప్యానెల్స్‌ను కస్టమ్ ఎఫ్‌టీసీ బ్రాండెడ్ ప్యానెల్స్‌తో రీప్లేస్ చేశారు. బైక్ వెనుక భాగంలో పెద్ద టైర్‌ను అమర్చారు. ఇండికేటర్లు కూడా బాణపు గుర్తులతో ఉన్నాయి. ఫ్రంట్ టైర్‌లో మాత్రం ఎలాంటి మార్పు లేదు. ఈ బైక్‌లో 97 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజిన్ ఉంటుంది. 4 గేర్లు ఉంటాయి. ఇకపోతే ఫుల్ థొరెటల్ కస్టమ్స్ ఈ స్ల్పెండర్ బైక్‌ను మోడిఫైడ్ చేసింది.