మహర్షిలో మీనాక్షి దీక్షిత్ రోల్ ఏంటి ?

SMTV Desk 2019-03-26 17:05:52  meenakshi deekshit

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా వంశీ పైడిపల్లి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న చిత్రం ‘మహర్షి’. ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ చిత్రం మే 9న విడుదల కానుంది. ఇకపోతే ఈ సినిమా కొంత భాగం న్యూయార్క్ సిటీ బ్యాక్ డ్రాప్ లో జరుగుతుందన్న సంగతి తెలిసిందే. ఇక ఆ భాగంలో మహేష్ బాబుకు ఒక గర్ల్ ఫ్రెండ్ కూడా ఉంటుందట. ఆమె మరెవరో కాదు ‘దూకుడు’ ఫేమ్ మీనాక్షి దీక్షిత్.

ఇకపోతే మీనాక్షి దీక్షిత్ ఇప్పటివరకు చిన్న చిన్న క్యారెక్టర్ రోల్స్, స్టార్ హీరోల సినిమాల్లో ఐటమ్ సాంగ్స్ చేస్తూ వచ్చింది. ఇప్పటికైనా ‘మహర్షి’ సినిమాతో ఆమె కెరీర్ కు మంచి బ్రేక్ వస్తుందో లేదో వేచి చూడాలి.