హిందూ బాలికల కిడ్నాప్ : ఇస్లామాబాద్‌ హైకోర్టు ఆగ్రహం

SMTV Desk 2019-03-26 16:58:46  pakistan, hindu girls kidnapped, marriage, islamabad high court, pak president, imran khan

ఇస్లామాబాద్, మార్చ్ 26: పాకిస్తాన్ లో ఇద్దరు హిందూ బాలికలు రీనా(15), రవీనా(13)ను ఎత్తుకెళ్లా కిడ్నాప్ చేసి వారిని మతమార్పిడి చేసి బలవంతపు పెళ్ళిళ్ళు చేయడంపై. ఇస్లామాబాద్‌ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. రవీనా, రీనాలకు రక్షణ కల్పించాలని ఘెట్కీ పోలీసులను ఆదేశించింది. మరోవైపు ఇదే ఘటనపై భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌.. పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ కు ట్వీట్‌ చేశారు. బాధితులిద్దరిని క్షేమంగా పేరెంట్స్‌ కు అప్పగించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. హోలీ నాడు ఘోట్కిలో అక్కా,చెల్లిని అపహరించిన దుండగులు మతం మార్పించి బలవంతంగా నిఖా చేసుకుకోవడం కలకలం రేపింది. అయితే దానికి సంబంధించిన వీడియో కాస్త వైరల్‌ కావడంతో దిద్దుబాటు చర్యలకు దిగింది.