బిజెపిలో చేరిన ప్రముఖ నటి

SMTV Desk 2019-03-26 16:51:16  Jayaprada,

ఢిల్లీ : ప్రముఖ నటి, రాజకీయవేత్త జయప్రద మంగళవారం బిజెపిలో చేరారు. గతంలో ఆమె పలు పార్టీలలో పని చ ేశారు. ఎంపిగా కూడా ఆమె పని చేశారు. యుపిలోని రామ్ పూర్ నుంచి ఆమె లోక్ సభ ఎన్నికల బరిలో నిలుస్తున్నారని సమాచారం. ఎస్ పి నేత ఆజంఖాన్ పై జయప్రద పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. రామ్ పూర్ నుంచి 2014లో బిజెపి అభ్యర్థి డాక్టర్ నేపాల్ సింగ్ గెలిశారు.2004 నుంచి 2014 వరకు ఈ నియోజకవర్గం నుంచి ఎస్ పి తరపున జయప్రద ఎంపిగా ఉన్నారు. అయితే ఇప్పుడు ఎస్ పి నుంచి పోటీ చేస్తున్న ఆజంఖాన్ పై జయప్రదం గతంలో ఘాటైన విమర్శలు చేసిన విషయం తెలిసిందే. ఆజంఖాన్ ను ఆమె అల్లావుద్దీన్ ఖిల్జీతో పోలుస్తూ విమర్శలు చేశారు. ఈ సారి బిజెపి నుంచి జయప్రద గెలిచే అవకాశాలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.