జీవా ‘కీ’ ట్రైలర్ చూసారా

SMTV Desk 2019-03-26 14:04:01  Jeeva , key trailer,

తమిళ హీరో జీవా ప్రధాన పాత్రలో నూతన దర్శకుడు కలీస్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘కీ’. ఈ సినిమాకు సంబంధించిన తెలుగు ట్రైలర్ ను రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. ‘ఇంకా 30 సెకండ్స్ లో మనం వాళ్ళను కనిపెట్టకపొతే.. వాళ్లే మనల్ని కనిపెట్టేస్తారు’ అని జీవా చెబుతున్న డైలాగ్ తో ట్రైలర్ మొదలవుతుంది. మధ్య మధ్యలో కొన్ని కామెడీ డైలాగులతో ట్రైలర్ మొత్తం రసవత్తరంగా సాగుతుంది. ఇందులో నిక్కీ గల్రానీ, అనైకా హీరోయిన్లుగా నటిస్తున్నారు. టెక్నాలజీ ని తప్పుడు మార్గంలో వినియోగించి ప్రజలతో ఆడుకుంటున్న సైబర్ నేరగాళ్లను హీరో ఎలా పట్టుకున్నాడు అనే దాని మీద ఈ సినిమా తెరకెక్కింది. ఇక ఈ సినిమా అటు తమిళ, ఇటు తెలుగు భాషల్లో ఏప్రిల్ 12న రిలీజ్ కానుంది.


కాగా ఇలాంటి కథాంశంతోనే గతంలో విశాల్ నటించిన ‘అభిమన్యుడు’ సినిమా వచ్చింది. అది రెండు భాషల్లోనూ పెద్ద హిట్ గా నిలిచింది. ఇక ఈ సినిమా ఎలా ఉండబోతోందో తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.