రాజకీయాల్లోకి ‘రంగీలా’ భామ

SMTV Desk 2019-03-26 13:07:05  urmila.

సార్వత్రిక ఎన్నికలు దగ్గరపడుతోన్న వేళ పార్టీలకు సినీ గ్లామర్‌ను జోడించడానికి సినీ ప్రముఖుల వైపు చూస్తున్నాయి రాజకీయ పార్టీలు. సినీ ప్రముఖులకు కొందరికి టికెట్లు ఇచ్చి ప్రచారం చేయించాలని చూస్తున్నారు. ఈ నేపథ్యంలో అలనాటి బాలీవుడ్ నటి ఊర్మిళ కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారనే వార్తలు ఊపందుకున్నాయి.

ఆమెకు కాంగ్రెస్ పార్టీ లోక్‌సభ టిక్కెట్ ఆఫర్ చేస్తూ ముంబై నగర పరిధిలోని నార్త్ ముంబై నియోజకవర్గం నుంచి బరిలోకి దించాలని యోచిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ విషయాన్నీ ఆ పార్టీ స్థానిక నేత ఒకరు వెల్లడించారు. కానీ ఈ అంశమై ఊర్మిళ, లేదా ఆమె కుటుంబ సభ్యులు స్పందించాల్సి ఉంది. ఆమె పేరుని పార్టీ పరిశీలిస్తోందని.. త్వరలోనే అధికారికంగా ప్రకటిస్తారని పార్టీ నేతలు పేర్కొన్నారు. ముంబై పరిధిలోని ఆరు లోక్‌సభ నియోజకవర్గాలకు ఏప్రిల్ 29న పోలింగ్ జరుగనుంది. ఇప్పటికే బాలీవుడ్ అగ్ర నటుడు సల్మాన్ ఖాన్‌తో మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ప్రచారం చేపించాలని యోచిస్తుంది.