మరో రికార్డు సొంతం చేసుకున్న జియో..!!

SMTV Desk 2017-08-12 11:01:05  jio, jio apps, 4G SERVICES, TELECOM INDUSTRY

ముంబై, ఆగస్ట్ 12 : ఇండియాలోనే సరికొత్త టెలికాం విప్లవానికి నాంది పలికిన రిలయన్స్ జియో, అత్యంత తక్కువ ధరకే 4జీ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చి రికార్డ్ సృష్టించిన విషయం తెలిసిందే. తాజాగా రిలయన్స్ జియో మరో రికార్డును సొంతం చేసుకుంది. "మై జియో" యాప్ ను గూగుల్ ప్లే స్టోర్ నుంచి 10 కోట్ల మంది డౌన్ లోడ్ చేసుకున్నారు. ఉచిత డౌన్ లోడ్ యాప్స్ లో ఈ "మై జియో" తొమ్మిదో స్థానంలో నిలిచింది. ఇండియాలో తయారైన మొబైల్ యాప్ లలో 10 కోట్ల మైలురాయిని తాకిన రెండో యాప్ ఇదే కావడం గమనార్హం. ఇవే కాకుండా ఈ జియో యాప్ లో జియో మ్యూజిక్, సినిమా, చాట్, మనీ వ్యాలెట్ వంటి యాప్స్ అన్ని కోటీకి పైగా డౌన్ లోడ్ లను సాధించాయి. కాగా ఏడాది వ్యవధిలోనే జియో ఈ రికార్డును సొంతం చేసుకోవడం విశేషం.