“ఎవెంజర్స్” టీమ్ లోకి ఏ ఆర్ రెహ్మాన్

SMTV Desk 2019-03-26 13:02:26  AR Rehman,

ప్రపంచ వ్యాప్తంగా మార్వెల్ కామిక్స్ కోసం తెలీని వారు ఉండరు.చిన్న చిన్న కార్టూన్ పాత్రల నుంచి మొదలైన వీరి ప్రస్థానం ఇప్పుడు ప్రపంచ బాక్సాఫీస్ లెక్కలు మార్చే దిశగా వచ్చింది.వీరి నుంచి వచ్చిన ప్రతీ ఒక్క సూపర్ హీరో పాత్రకు ఒక్కో ప్రత్యేకత ఉంటుంది.అలాగే వీరి సారథ్యంలోనే తాజాగా వచ్చిన “క్యాప్టెన్ మార్వెల్” వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ దగ్గర 1 బిలియన్ మార్క్ దిశగా వసూళ్లను రాబడుతుంది.మార్వెల్ సంస్థ నుంచి “ఎవెంజర్స్” సిరీస్ కు ఉన్న ప్రత్యేకతను కొత్తగా చెప్పనవసరం లేదు.

గత ఏడాది విడుదలైన “ఎవెంజర్స్ ఇన్ఫినిటీ వార్” బాక్సాఫీస్ దగ్గర ఎంతటి విధ్వంసం సృష్టించిందో కూడా అందరికీ తెలుసు.ఇక దాని నుంచి కొనసాగింపుగా ఇప్పుడు రాబోతున్న “ఎవెంజర్స్ ఎండ్ గేమ్” సినిమా పై అయితే వర్ణించలేని స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి.”స్టాన్ లీ”(ఎవెంజర్స్ పాత్రల సృష్టికర్త) పరిచయం చేసిన “స్పైడర్ మ్యాన్”,”ఐరన్ మ్యాన్” పాత్రల సహా “థోర్” “బ్లాక్ పాంథర్” “హల్క్” ఇలా చాలా మంది సూపర్ హీరోలకే మన భారతదేశం నుంచి కూడా విపరీతమైన ఫ్యాన్స్ ఉన్నారు.

ఈ అందరు సహా ఇంకొంతమంది సూపర్ హీరోలను కలిపి “ఎవెంజర్స్”గా పరిగణిస్తారు.ఇప్పుడు అలాంటి భారీ ప్రాజెక్ట్ లో ఆస్కార్ అవార్డు గ్రహీత ఏ ఆర్ రెహ్మాన్ కూడా ఒక భాగం కానున్నారని వెల్లడైంది.మార్వేల్ సంస్థ వారు భారతదేశంలో ఉన్న అభిమానుల దృష్ట్యా తెలుగు,తమిళ్ మరియు హిందీ భాషల్లో పాటలు సమకూర్చనున్నారని ప్రముఖ సినీ క్రిటిక్ తరన్ ఆదర్శ్ వెల్లడించారు.అలాగే ఆ పాటను వచ్చే ఏప్రిల్ 1 న విడుదల చేయనున్నారని తెలిపారు.అసలే రెహ్మాన్ అంటేనే గ్రాండియర్ మరి ఈ సినిమాకి ఏ స్థాయి సంగీతాన్ని అందిస్తారో చూడాలి.భారీ అంచనాలతో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఏప్రిల్ 26న విడుదల కానుంది.