ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్

SMTV Desk 2019-03-26 11:21:10  Chattisghar, Terrorist

ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్ జరిగింది. సుక్మా జిల్లాలో భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎదురుకాల్పుల్లో నలుగురు మావోయిస్టులు మృతిచెందారు. ఘటనా స్థలం నుంచి ఇన్సాస్‌ రైఫిల్‌ సహా, రెండు 303 రైఫిళ్లను స్వాధీనం చేసుకున్నారు. మరికొంతమంది మావోయిస్టుల ఉన్నారన్న సమాచారంతో వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.