వైసీపీ లో చేరనున్న మోహన్ బాబు ?

SMTV Desk 2019-03-26 11:18:13  Mohan Babu, Jagan

సినీ పరిశ్రమ నుండి వైకాపాకు అనూహ్య రీతిలో మద్దతు లభిస్తోంది. నటులు, ప్రముఖులు ఉన్నట్టుండి బయటికొచ్చి జగన్ పట్ల ఎన్నడూ లేని మద్దతును, నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నారు. కొందరైతే ఏకంగా ఆ పార్టీలో చేరిపోతున్నారు. కొన్నిరోజుల క్రితం తన విద్యానికేతన్ విద్యా సంస్థకు ఫీజు రీఎంబర్సిమెంట్ నిధుల్ని ప్రభుత్వం ఎందుకు విడుదలచేయడంలేదు అంటూ రోడ్డెక్కి, చంద్రబాబుపై తీవ్రమైన ఆరోపణలు చేసిన నటుడు మోహన్ బాబు ఈరోజు ఇంకో అడుగు ముందుకేశారు.

ఇంకొద్దిసేపట్లో ఆయన వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ను కలవనున్నారు. వైఎస్ కుటుంబంతో బంధుత్వం కలిగిన మోహన్ బాబు కొన్నాళ్ళుగా జగన్ మోహన్ రెడ్డితో సాన్నిహిత్యంగా ఉంటున్నారు. దీంతో జగన్ ప్రోద్బలంతోనే ఆయన టీడీపీపై నిరసనకు దిగారని, ఇదంతా ఎన్నికల స్టంట్ అని వార్తలొచ్చాయి. ఈ నేపథ్యంలో వీరి భేటీ మరింత హాట్ టాపిక్ అయింది. కొందరు మోహన్ బాబు వైకాపాలో చేరిపోతారని అంటే, ఇంకొందరు పార్టీలో చేరకపోయినా ఎన్నికల్లో పూర్తి మద్దతు ఇస్తారని అంటున్నారు. మరి మోహన్ బాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.