దేవుడిలా కొలిచిన ప‌వ‌న్ ఇలా చేస్తాడ‌ని ఊహించలేదు : కొణతాల

SMTV Desk 2019-03-26 11:17:27  Konatala, pawan kalyan

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ల్యాణ్‌పై కొణ‌తాల సీతారాం సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేయ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. కొణ‌తాల జ‌న‌సేన పార్టీ త‌రుపున అన‌కాప‌ల్లి టికెట్ ఆశించి భంగ‌ప‌డ్డారు. సోమ‌వారం రెబ‌ల్ అభ్య‌ర్థిగా అన‌కాప‌ల్లిలో నామినేష‌న్ దాఖ‌లు చేసిన కొణ‌తాల సీతారాం. జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్‌పై విమ‌ర్శ‌లు గుప్పించారు. భూక‌బ్జాకోరు ప‌రుచూరి భాస్కర్‌కు టికెట్ ఇచ్చి న‌న్ను మోసం చేశార‌ని, పార్టీ కోసం తానే 7 కోట్లు ఖ‌ర్చు చేశాన‌ని ఈ సంద‌ర్భంగా చెప్పుకొచ్చారు. అలాంటి న‌న్నే ఏడు కోట్ల‌కు అమ్ముడు పోయావంటూ అస‌త్య ప్ర‌చారం చేస్తున్నార‌ని జ‌న‌సేన‌పై మండిప‌డ్డారు కొణ‌తాల‌.

కార్య‌క‌ర్త‌ల మ‌నోభావాలు దెబ్బ‌తింటే పార్టీ మ‌నుగ‌డ క‌ష్ట‌మ‌ని కొణ‌తాల స్ప‌ష్టం చేశారు. విశాఖ‌ప‌ట్నం నుంచి ఢిల్లీ వ‌ర‌కు జ‌న‌సేన జండా మోసాన‌ని అలాంటి నాకు టికెట్ ఇవ్వ‌కుండా జ‌న‌సేనా మోసం చేసింద‌ని, ఈ విష‌యాన్ని అడిగేందుకు వెళితే బౌన్స‌ర్‌లు త‌న‌పై పిడిగుద్దులు కురిపించార‌ని వాపోయారు. దేవుడిలా కొలిచిన ప‌వ‌న్ ఇలా చేస్తాడ‌ని ఊహించ‌లేద‌ని ధ్వ‌జ‌మెత్తారు. అయితే ఉన్న‌ట్టుండి కొణ‌తాల సీతారాం కొత్త ప‌ల్ల‌వి ఎత్తుకోవ‌డం వెనుక చంద్ర‌బాబు వుంటే అవ‌కాశం వుంద‌ని, ఈ మాట‌ల‌న్నీ త‌ను చెబుతున్నాడా? లేక త‌న‌తో చంద్ర‌బాబు చెప్పిస్తున్నాడా? అని పార్టీ వ‌ర్గాలు చెబుతున్నాయి.