అమలా పాల్ మాజీ భర్తతో సాయి పల్లవి పెళ్ళా ?

SMTV Desk 2019-03-26 11:16:33  amala paul, sai pallavi

ప్రేమమ్‌’ చిత్రంతో సౌత్ ఇండస్ట్రీని షేక్ చేసిన సాయి పల్లవి తొలి సినిమాతోనే ఫేమస్ అయిపొయింది. తెలుగులో ఫిదా, మిడిల్ క్లాస్ అబ్బాయి లాంటి చిత్రాలతో ఆకట్టుకుని తెలుగుతో పాటు మలయాళం తమిళ భాషల్లోనూ వరుస అవకాశాలతో దూసుకుపోతున్న ఈ భామ గురించి ఒక ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. అదే ఏ ఎల్ విజయ్‌ అంటే అమలా పాల్ మాజీ భర్తతో సాయి పల్లవి పెళ్లట.

అమలాపాల్‌తో ప్రేమలో మునిగితేలి ఆ తర్వాత కొన్నేళ్లు పాటు డేటింగ్ చేసిన అనంతరం పెళ్లి చేసుకున్న ఏఎల్ విజయ్‌ తో రెండో పెళ్లికి సాయి పల్లవి రెడీ అయ్యిందని తమిళ మీడియాలో హల్ చల్ చేస్తుండటంతో సాయి పల్లవి ఫ్యాన్స్‌ ఫైర్ అవుతున్నారు. ఇలాంటి గాలి వార్తల్ని నమ్మొద్దని.సాయి పల్లవి అమలాపాల్ మాజీ భర్తను ఎందుకు చేసుకుంటుందని ఆమె ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. సాయి పల్లవి నటించిన ‘కణం’ చిత్రానికి దర్శకత్వం వహిచారు ఏ ఎల్ విజయ్. అప్పటి నుండి ఇద్దరి మధ్య ప్రేమ చిగురించడంతో త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నారంటూ తమిళ మీడియాలో రూమర్స్ చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఇటీవలే సాయి పల్లవి జీవితంలో అసలు పెళ్లే చేసుకోనంటూ బాంబ్ పేల్చింది. అయితే ఇప్పుడు మళ్లీ ఆమె పెళ్లి గురించి వార్తలు రావడం సాయి పల్లవి ఫాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు.