డేవిడ్ వార్నర్ ను బీట్ చేసిన గేల్ .. 4000 రన్స్ క్లబ్ లోకి

SMTV Desk 2019-03-26 11:00:03  gayle

విండీస్ బ్యాట్స్‌మెన్ క్రిస్ గేల్ ఐపీఎల్‌ 12వ సీజన్‌లో తన సత్తా చాటాడు. సవాయ్ మాన్‌సింగ్ స్టేడియం వేదికగా రాజస్థాన్ రాయల్స్ జట్టుతో జరుగుతున్న నాల్గవ లీగ్ మ్యాచ్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఓపెనర్ క్రిస్ గేల్ అతి తక్కువ ఇన్నింగ్స్‌లో 4వేల పరుగులు చేశాడు. ఈ రికార్డును 112 ఇన్నింగ్స్‌లో సాధించి గేల్ మొదటిస్థానంలో నిలిచాడు. రెండో స్థానంలో 114 ఇన్నింగ్స్‌తో సన్‌రైజర్స్ హైదరాబాద్ మాజీ కెప్టెన్ డేవిడ్ వార్నర్ నిలిచాడు. మూడో స్థానంలో 128 ఇన్నింగ్స్‌తో విరాట్ కోహ్లీ, నాలుగో స్థానంలో 140 ఇన్నింగ్స్‌తో సురేష్ రైనా మరియు గౌతమ్ గంభీర్‌లు నిలిచారు.

అయితే ఇప్పటివరకు గేల్ తన కెరీర్‌లో ఎన్నో రికార్డులను బద్దలుకొట్టాడు. ముఖ్యంగా టీ-20 ఫార్మాట్‌లో గేల్ ఎన్నో తిరుగులేని రికార్డలు సాధించాడు. గత సీజన్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ టీంలో చేరిన గేల్ అంతకు ముందు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టులో ఉన్నప్పుడు రికార్డుల మోత మోగించాడు.