ఆదిత్యనాథ్ సొంత నియోజకవర్గంలో విషాదం

SMTV Desk 2017-08-11 20:08:04  uttar pradesh, 30 children died, yogi adityanath

ఉత్తర్ ప్రదేశ్, ఆగస్ట్ 11: 48 గంటలలో 38 మంది పిల్లలు ఆక్సిజన్ సరఫరా ఆగిపోవడంతో మరణించిన ఘటన గోరఖ్ పూర్ లోని బీఆర్డీ ఆస్పత్రిలో చోటు చేసుకుంది. సీఎం ఆదిత్యనాథ్ సొంత నియోజకవర్గమయిన గోరఖ్ పూర్ లో ఈ విషాదం జరిగింది. అంతకుముందు ఆగస్టు 9న యూపీ ముఖ్యమంత్రి ఈ ఆస్పత్రికి తనిఖీకి వెళ్లడం గమనార్హం. అయితే బీఆర్డీ ఆస్పత్రి ఆక్సిజన్ కంపెనీకి రూ. 66 లక్షలు చెల్లించాల్సి ఉంది. కాని వ్యయం చెల్లించకపోవడంతో ఆక్సిజన్ సరఫరా నిలిపివేయబడింది. దీంతో మెదడువాపు వ్యాధి చికిత్స పొందుతున్న 38 మంది చిన్నారులు తమ ప్రాణాలు కోల్పోయినట్లు ఆ జిల్లా కలెక్టర్ ప్రకటించారు. అంతకు ముందు మే 2017 లో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఉత్తరప్రదేశ్ లో ప్రతి ఏటా వందలాది మంది పిల్లల జీవితాలను గూర్చిన ఘోరమైన మెదడువాపు వ్యాధిని నిర్మూలించడానికి ఒక ప్రచారం ప్రారంభించారు. రాష్ట్రంలోని తూర్పు ప్రాంతంలోని 38 జిల్లాల్లో జరుగుతున్న ప్రచారంలో ప్రజల భాగస్వామ్యం ఎంతో ముఖ్యమని మరియు దాని అవగాహన గురించి ఆయన పలుమార్లు ప్రసంగించారు కూడా.